Tag: nagarjuna movie
ఎంజాయ్ సరే.. బిగ్ బాస్ సంగతేంటి నాగ్?
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న సుందర ప్రదేశాల్లో ఇటీవలే మొదలైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన పరవశించిపోయారు. ప్రేక్షకులతో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. “హాయ్.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. ఈ సినిమా…