భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాల్ని కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డ్‌తో గ్లోబల్‌వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ చేత ’నాటు నాటు’ స్టెప్పులు వేయించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా.. ఈ జాతీయ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ అందుకొని.. 69 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో.. ప్రతీ తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వంగా ఉప్పొంగుతున్నారు. ముఖ్యంగా.. ఇండస్టీక్రి చెందిన వాళ్లు సంబరాలు…