“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళవారం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ కథానాయకుడు అడవి శేష్‌తో పాటు బ్లాక్‌బస్టర్ నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషించిన దర్శకుడు కరుణకుమార్ తో, ప్రముఖ గాయకుడు పెంచలదాస్‌తో పాటు చిత్రంలో నటించిన నటీనటులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు. ఈ వేదికపై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు అడవి…