హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత, సంకల్పం అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ – టోక్యో, జపాన్ నుండి జపాన్ ఫిల్మ్ – అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందంతో సంభాషించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను, దానిని సాకారం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా జపాన్ ప్రతినిధి బృందాన్ని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. చిత్ర పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి…
