సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు 14 ఏళ్ల తరువాత ’గుంటూరు కారం’ సినిమా రూపంలో అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది, ఇందులో శ్రీలీల, విూనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర తారాగణం. సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పండగకి విడుదలైన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే. సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు ఉండడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) ఒక రాజకీయనాకుడు, అతని కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్యం (జయరాం) తో వివాహం…