కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పార్క్ హయత్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్…