ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా.. ఎక్కడవిన్నా దర్శకధీరుడి గురించే. ఆయనకు ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. కారణం లేకపోలేదు.. దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతటి గొప్ప వ్యక్తిని మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అందుకే ఈ ప్రశంసలు. టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటినుంచి దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకుంటూ వస్తున్న రాజమౌళికి అవార్డులు అనేవి కొత్తవికాకపోయినా.. ఈ అవార్డు మాత్రం ఖచ్చితంగా గొప్పదే అనొచ్చు. విషయాల్లోకి వెళితే..న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) ‘త్రిబుల్ ఆర్’ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా కూడా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ…