కొత్త సినిమా కోసం మహేష్ బాబును కొతగా చూపాలని స్టార్ డైరెక్టర్ రాజమౌళి యోచిస్తున్నారు. అందుకోసం మహేష్ బాబును కేవలం షూటింగ్‌కే పరిమితం చేయాలని, బయటకనపడకుండా చూడాలని అనుకుంటున్నాడట. అందుకే అతను ఇక పబ్లిక్ గా కనిపించరాదని ఆంక్షలు పెట్టారని టాక్ నడుస్తోంది. మహేష్ బాబు ఎలాంటి ఈవెంట్స్ కు కానీ, మూవీ ఫంక్షన్స్ కు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇకపై మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించకూడదని ఎస్‌ఎస్ రాజమౌళి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్స్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పాత్ర కోసం…