డా.బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న యాంథాలజీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది. ‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా…