హీరో కోసం కోట్ల ఆస్తిని రాసిచ్చింది..

Crores of property written for the hero..

హీరో అభిమాని ఏకంగా కొన్ని కోట్ల విలువైన తన ఆస్తిని స్టార్‌ హీరో పేరు మీద రాసిచ్చి చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. సదురు హీరో చలించిపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. ముంబైకు చెందిన నిషా పాటిల్‌ కు నటుడు సంజయ్‌ దత్‌ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్‌ నుంచి ఖల్‌ నాయక్‌ దాకా, సంజు నుంచి కెజిఎఫ్‌ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది. అయితే ఇటీవల నిషా పాటిల్‌ కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటికి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. కాగా, అదంతా సంజయ్‌ దత్‌కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్‌ కు…