45 ఏళ్ల నా నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి ‘అనుకోని ప్రయాణం’ : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్

Anukoni prayanam pre relese event

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ ‘అనుకోని ప్రయాణం’అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు. 45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర…