ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించిన ఆయా అంశాలు చూడముచ్చటగా అర్ధవంతంగా నాట్య ప్రియులను ఆకట్టుకున్నాయి. ముంబయికి చెందిన నృత్యోదయ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో అమెరికా నుంచి విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన విశిష్ఠ డింగరి భరత నాట్య సోలో ప్రదర్శన జరిగింది. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేసి విశిష్ఠ డింగరి నృత్య ప్రదర్శనకు శుభారంభం పలికారు. ముంబయికి చెందిన ప్రముఖ నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ శిష్యురాలు అయిన విశిష్ఠ సాంప్రదాయ నృత్యాంజలితో తన ప్రదర్శన ప్రారంభించింది. ప్రతి అంశంలోనూ తన ప్రతిభను చాటుకుంది. ప్రధాన వర్ణం అంశంలో కరహరప్రియ రాగంలో తెన్మాడ నరసింహాచారి…