ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఒరిజినల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్‌పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయగా అమేజింగ్ రస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.. Video…