డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా సైతాన్ వెబ్ సీరీస్ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ… సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరకో సేవ్ టైగర్స్ కు కొనసాగింపు ఉంటుంది, అలాగే సైతాన్ కు…