‘‘ఇప్పుడు విదేశాల్లో తెలుగువాడి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆరోజుల్లోనే ఎన్టీఆర్‌గారు మన పవర్ ఏంటో రుజువు చేశారు. వాటిని ఎప్పటికీ మరచిపోకూడదు.. గుర్తు చేసుకుంటూనే ఉండాలి’’ అని అన్నారు హీరో రామ్ చరణ్. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ శత జయంతి వేడుకలకు హాజరైన హీరో రామ్ చరణ్ స్వర్గీయ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భం గురించి ఆయన మాట్లాడుతూ .. Actor Ram Charan Speech @ NTR 100 Years Celebrations #100YearsOfNTRLegacy ‘‘ఎక్కడ మొదలు…