కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్ : ‘అహింస’ హీరోయిన్ గీతికా తివారీ

కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్: 'అహింస' హీరోయిన్ గీతికా తివారీ

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ గీతికా తివారీ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? – మాది మధ్య ప్రదేశ్, జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.…