ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో సంతోష్ శోభన్ మీడియాతో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు. ఈ చిత్రం ఎలా మొదలైంది? నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. పేపర్‌బాయ్ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్ లో వచ్చింది అనుకున్నాను. అలా…
