యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు…
