సంక్రాంతి కానుక‌గా ‘ఊహించలేదు కదు’

oohinchaledu kadhu in sankranthi race

కోలీవుడ్ హీరో శ్రీరామ్ నటించిన సినిమా ‘ఓమ్ శాంతి ఓమ్’. బైలింగ్వ‌ల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఊహించలేదు కదు’ పేరుతో అదే రోజు విడుదల చేయబోతున్నారు. శ్రీరామ్ కు జోడీగా నీలమ్ ఉపాధ్యాయ నటించారు. ఈ సినిమాను రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండడం , ఆపై జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

పునః ప్రారంభమైన నాగ శౌర్య చిత్రం

naga shourya new film shooting resumed

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల. చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి. నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్నిర్మాత: సూర్య దేవర నాగవంశీదర్శకత్వం: లక్ష్మీసౌజన్య

సుశాంత్ న్యూ మూవీ షూటింగ్ పునఃప్రారంభం

ichata vahanamulu nilupa radu shooting resumed

యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. దాని త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌. ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్‌, మీనాక్షి చౌధ‌రి ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీ‌నివాస‌మౌళి ర‌చించారు. కొరియోగ్రాఫ‌ర్ రాజ్ కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్…

‘బంజారావుడ్’ ప్రారంభం

Banjara film industry Banjarawood started

భారతదేశం సంప్రదాయాలకు, వేశధారణకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో 15 కోట్ల 50 లక్షల మంది బంజారాలు ఉన్నారు. ఈ బంజారా ప్రజలు ప్రతి రంగంలో ముందున్నారు. అలాంటి వారు సినిమా రంగంలో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గోర్ జీవన్ సినిమాలు తనకంటూ ఒక స్థానం సంపాదించాలనుకున్న కెపిఎన్. చౌహన్ తన బంజారా ప్రజలకు ఒక సినిమా పరిశ్రమ కావాలంటూ కష్టపడి బంజారా ఫిలిం ఇండస్ట్రీని స్థాపించారు. ఇది ప్రతి బంజారా బిడ్డ చెప్పుకోదగ్గ విషయం. 8 నుండి 10 కోట్ల జనాభా ఉన్న ఏపి – తెలంగాణ స్టేట్స్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే నాలుగు కోట్ల చిల్లర ఉన్న కెనడా ప్రజలకు కెనడా ఇండస్ట్రీ ఉంది. రెండు కోట్ల జనాభా ఉన్న భోజ్ పూరి ప్రజలకు సినిమా ఇండస్ట్రీ ఉంది. అలాంటిది దేశం మీద…

జనసేనానితో కిచ్చా భేటీ

Kichha Sudeep meets Power Star Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రముఖ నటుడు, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

నితిన్, యేలేటి చిత్ర టైటిల్ ‘చెక్’

Youth Star Nithiin and Chandra Sekhar Yeleti Film Check under Bhavya Creations

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘చెక్’ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ఈసినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్పెడతారనేది చివరి వరకూ తెలియదు.…

అల్లు వారి ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభం

Allu Ramalingaiah birth anniversary special Allu Studio Launched

తెలుగు ప్రేక్ష‌కులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. హాస్యం ఆయ‌న కేరాఫ్ ఆడ్రస్‌, హాస్యానికే ప్రాణం పోసిన బ్ర‌హ్మ ఆయ‌న‌.. అన్ని ర‌సాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్ర‌నైనా అల‌ఓక‌గా చేసి చూపించిన గొప్ప న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి మార్గదర్శకుడయ్యాడు. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే పాత్ర క‌నిపిస్తుందికాని ఆయ‌న క‌నిపించ‌రు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం అల్లు రామ‌లింగ‌య్య అంటే అతిశ‌యోక్తికాదు. తెలుగు సినిమా చరిత్రలో గ‌ర్వించ‌ద‌గ్గ‌ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య పాత్రలు వుండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించారు, త‌రువాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో న‌టుడుగా ఎంత బిజీగా వున్నా కూడా త‌న వృత్తి హోమియోప‌తిని మాత్రం వ‌ద‌ల్లేదు.…

‘చిత్రపటం’ టాకీ పార్ట్ పూర్తయింది

Chitrapatam Movie Takie Part Completed

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వంలో, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చిత్రపటం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోసాని, శరణ్యగారు, నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే…

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘అన్ లిమిటెడ్’

Youthful Entertainer Unlimited Movie shooting details

నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌ హీరోహీరోయిన్లుగా అమన్ కుమార్, శ్రద్ధ ద్వివేది, తనూజ్ దీక్షిత్, అనిల్ రాస్తోగి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అన్ లిమిటెడ్’. విక్రమ్ వాసుదేవ్ నార్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు విక్రమ్ వాసుదేవ్ నార్ల మాట్లాడుతూ.. విమెన్ ఎంపవర్మెంట్‌ని తప్పుదారి పట్టిస్తున్న కొంతమంది వల్ల సమాజానికి జరుగుతున్న చేటుని చెబుతూనే సృష్టికి మూలాధారమైన ఓంకారంలో ఇమిడి ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రధాన అంశంగా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ఏషాన్, ఆయిషా కపూర్‌లని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాము. తెలుగు, హిందీ భాషలలో మీడియా బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది ‘అన్…

‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ ఇదే!

parigettu parigettu first look out

ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “పరిగెత్తు పరిగెత్తు” యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ… ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. “పరిగెత్తు పరిగెత్తు” చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌…