ఈ బిజీ సమయంలో క్లాత్ వాషింగ్ అనేది అందరికి పెద్ద బర్డెన్‌గానే వుంటుంది. ఈ కరోనా సమయంలో బట్టలశుభ్రత మరింత అవసరం. అయితే మీకు అందుబాటు ధరలో మీ బట్టల శుభ్రత బరువును దించేయాలనుకుంటుది వే టు వాష్ డ్రైక్లీనింగ్ సంస్థ. ఇటీవల మాదాపూర్‌లోని అయ్యప్పసోసైటీలో, హాండ్రెడ్ ఫీట్స్ రోడ్డులో ఈ సంస్థ వే టు వాష్ డ్రైక్లీనింగ్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. వేటు వాష్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఉచిత పికప్ అండ్ డ్రాప్‌తో సర్వీసులు అందిస్తున్నామని, పూర్తి హైజీనిక్‌తో.. ఎంతో నాణ్యమైన సేవలను ఇస్తున్నామని సంస్థ నిర్వాహకులు గరగ సోమన్న, వెంకటసత్యనారాయణ గొల్ల తెలిపారు. త్వరలోనే జంటనగరాల్లో తమ ఔట్‌లెట్‌లు విస్తరిస్తున్నట్లుగా వారు తెలిపారు.
Category: FILM NEWS
గాన గంధర్వుడు బాలు కన్నుమూత
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు…
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘బ్యూటీ గర్ల్’
లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా.. వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. ఈ చిత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ ‘బ్యూటీ గర్ల్’ సినిమాను నిర్మిస్తున్నాను. మా డైరెక్టర్ వేముగారి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రాబోతుంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో…
‘మెరిసే మెరిసే’ చిత్ర టైటిల్ లుక్ వచ్చేసింది
కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ… ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా…
‘కబ్జ’ థీమ్ పోస్టర్.. అదిరింది
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిర్మించగా, లాంకో శ్రీధర్ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్ ను ఆర్.జి.వీ. చేతులు మీదుగా విడుదల చేశారు. ‘కె.జి.ఎఫ్’తో 2018లో కన్నడ సినిమా ఇక్కడ అందరికీ దగ్గర అయినప్పటికీ, పలు తెలుగు సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన ఉపేంద్ర ఇక్కడ అందరికి సుపరిచితమే. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్ వంటి వైవిధ్యంగా ఉండే తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ఉపేంద్ర. సన్ ఆఫ్ సత్యమూర్తి తో 2015లో తెలుగు సినిమాను మళ్ళీ పలకరించగా, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జ’ తో మళ్ళీ కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో పలకరించబోతున్నారు. తెలుగులో…
‘తెరవెనుక’ ఫస్ట్ లుక్ విడుదల
ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం “తెరవెనుక”. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , TNR , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ.. తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.…
ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 ‘రాము’ సెట్టెక్కింది
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్‌లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ……
దసరా బరిలో.. ‘కలర్ ఫోటో’
హ్రుదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సూపర్‌హిట్ నిర్మాణసంస్థ అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై, శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇటీవల పలు చిత్రాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమృత ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు కలర్ ఫొటో చిత్రానికి కథ కూడా…
ఫస్ట్ టైమ్ కాంట్రవర్శీలో కీర్తిసురేష్
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా, కీర్తిసురేష్ కథానాయకిగా తెరకెక్కిన చిత్రానికి ”ఐనా ఇష్టం నువ్వు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. తొలుత దీనికి ”ఐనా…ఇష్టం నువ్వు”. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ దేవ్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యింది. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది. నిర్మాత నట్టికుమార్ ఫైర్ఈ చిత్రాన్ని తమకు అమ్మినట్లు బాండ్ పేపర్లు సాక్షాదరాలు ఉన్నాయి, అయినా సరే ఎస్ట్రా మనీ కోసం నిర్మాత చంటి అడ్డాల తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.…
‘రేప్ డి’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం
టాలెంట్ కేఫ్ బ్యానర్ లో ఇష్టంగా ఫెమ్ అర్జున్ మహి, శేఖరం గారి అబ్బాయి ఫెమ్ విన్ను మద్దిపాటి హీరోలుగా కారుణ్య చౌదరి, మాయ నెల్లూరి, అమీక్ష హీరోయిన్లుగా రవి శర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్ ‘రేప్ డి’. క్రైం థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ వెబ్ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది. శనివారం రోజు ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు టాలెంట్ కేఫ్ ఆఫీసులో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు ప్రారంభం అయ్యింది. వీడు మాములోడు కాదు, ఝలక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రవి శర్మ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీదేవి గారు మాట్లాడుతూ…షూటింగ్ షెడ్యూల్స్ ఈ నెల 22వ తేదీ వరకు ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ మూడోవారంలో…
