మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి: దర్శకుడు రామ్‌ నారాయణ్‌

అల్తాఫ్‌ హసన్‌ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్‌’. సెవెన్‌హిల్స్‌ సతీశ్, రామ్‌ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్‌’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్‌ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్‌ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌…

చిరంజీవి గారిని సాయం చేసే విషయంలో విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు: కాశీ విశ్వనాధ్

ఒక సాదరణ కానిస్టే బుల్ కొడుకుగా పుట్టి.. B.com., వరకూ చదువుకుని, సినిమాలపై మోజు పెంచుకుని,హీరో అవుదామని.. మద్రాసు వెళ్ళి.. ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి.. ఫ్రెండ్స్ తో రూముల్లో ‘వంటలు’ అవీ చేసుకుని.. హీరో అవటానికి కావలసిన అర్హతల కోసం.. Excersise లు చేసి..ఫోటోలు పట్టుకుని.. ఆఫీసుల చుట్టూ తిరిగి.. అవకాశాలు అందిపుచ్చుకుని.. నిరంతరం శ్రమించి, ఎంతో.. home workచేసి.. ఎన్నో టెన్షన్స్ పడి .. మెట్టు.. మెట్టు ఎక్కి.. ‘మెగాస్టార్’ స్తాయికి ఎదిగిన వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులలో .. అవినీతి గానీ, అక్రమార్జన గానీ, అన్యాయపు సంపాధన గానీ మచ్చుకైనా వుందా..? ఒక పక్క.. సిన్సియర్ గా Income tax లు, GST లు కడుతూ.. వచ్చిన దానిని.. జాగర్తగా Invest చేసి.. ఈ stage కి వచ్చాక..…

పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ

గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనూసూద్ నిర్విరామంగా సహాయలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో కష్టాలు లేకుండా చేస్తున్నాడు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ సహాయల సంఖ్య మరింత ఎక్కువగా మారింది.సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్ ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్థనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్…

రొమాంటిక్ థ్రిల్లర్ ‘తీరం’ మోషన్ పోస్టర్ విడుదల

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా  అనిల్ ఇనమడుగు దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం “తీరం”. ఈ చిత్రం టైటిల్,  మోషన్ పోస్టర్ ను మే 30న హైదరాబాద్  ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తీరం సినిమా హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, మై విలేజ్ షో అనిల్, అజయ్ సన్నపు, విజయం పన్నేరు, అజస్ జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ- ‘ పూర్తి స్థాయి సంగీతం మరియు సస్పెన్స్ తో  కూడిన రొమాంటిక్  ప్రేమకథాచిత్రంగా తీరం సినిమాని రూపొందించాం.  సినిమా అంతా  ఒక హృద్యమైన…

‘ఊర్వశి’ మరింత వృద్ధి చెందాలి: సూపర్ స్టార్ కృష్ణ

తన పుట్టినరోజును పురస్కరించుకుని… తనపై ప్రత్యేక పాటను విడుదల చేసిన ‘ఊర్వశి ఓటిటి’ మరింతగా వృద్ధి చెందాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. “తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా” అనే పంక్తులతో మొదలయ్యే ఓ ఉత్తేజభరిత గీతాన్ని.. ప్రముఖ దర్శకులు వీరు.కె స్వర సారధ్యం మరియు రచనలో.. ప్రముఖ సంగీత దర్శకులు-నటులు-దర్శకులు-గాయకులు ఆర్.పి.పట్నాయక్ ఆలపించారు. యువ గాయని మౌనిక గొంతు కలిపారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఊర్వశి సౌజన్యంతో ఈ ప్రత్యేక గీతం రూపుదిద్దుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని… ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఊర్వశి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ… తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణగారికి.. పుట్టినరోజు కానుకగా.. ఆయనపై ఓ ప్రత్యేక పాటను రూపొందించే అవకాశం ఇచ్చిన ప్రముఖ నటులు-‘మా’…

పడుచు ప్రేమికుల ప్రణయ కథనం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’

‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ అనంతరం ప్రముఖ గీత రచయిత, బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. పావని టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోధ-కిరణ్-సాంబ హీరోలు. ప్రఖ్యాత రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాధ్, హేమసుందర్, వైభవ్, యోగి, భవాని ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ వినోదభరిత ప్రేమకథాచిత్రాన్ని ‘రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్’ పతాకంపై శరత్ చెట్టి (యూఎస్ఏ) సమర్పణలో శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 6 న ప్రముఖ ఓటిటి ఊర్వశి ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన చిత్ర దర్శకులు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ.. “ముందుగా మా “లావణ్య విత్ లవ్…

పేదలకు ఆహరం , సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన

‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేసారు హీరోయిన్ సంజన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కోవిడ్‌ భాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి బయటపడుతుంది. నేను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మే…

విజయ్‌దేవ‌ర‌కొండ ‘గుండె క‌థ వింటారా’ ?

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై  క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి  `ఎంత బావుందో…‌` లిరిక‌ల్ సాంగ్‌ని విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా…గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి  మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య  సాహిత్యం…