పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
వైభవంగా ‘డ్యూ డేట్’ చిత్రం ప్రారంభం
Spread the love పీఆర్ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్... -
స్పెషల్ స్టోరీ…యాక్షన్ మోడ్ లో టాప్ హీరోలు!
Spread the love టాలీవుడ్ లో ప్రస్తుతం మన స్టార్ హీరోలు అంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో యమ బిజీబిజీగా ఉన్న సంగతి... -
‘హృదయం మురళి’ అందరికీ రిలేట్ అయ్యే సినిమా : ప్రెస్ మీట్లో హీరో అథర్వా
Spread the love అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి....
