యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దేవాలయాన్ని సందర్శించిన గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ .వి రమణ, గౌరవ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి, గౌరవ దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, గౌరవ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్.ఎలిమినేటి సందీప్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి, రాచకొండ సీపీ మురళి మహేష్ భగవత్ తో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

మహిళా సినీ వర్కర్స్ కు ‘మనం సైతం’ సాయం

కరోనా కష్టకాలంలో షూటింగ్ లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా సినీ వర్కర్స్ అక్కా చెల్లెల్లకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు “మనం సైతం” కాదంబరి కిరణ్. తన సేవా సంస్థ “మనం సైతం” ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. “తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్” కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళ వర్కర్స్ కాదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….మా మహిళా వర్కర్స్ సిస్టర్స్ కు మనం సైతం ద్వారా చేతనైన సాయం అందించడం సంతోషంగా ఉంది. గతేడాది లాగే ఈ సారి కూడా కరోనా లాక్ డౌన్ వల్ల మహిళా వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారు. “తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్‌…

Creative Director Krish Launched Trailer Of Abhinav Sardhar and Ram Karthik Starrer Sci-Fi Action Drama Peanut Diamond

Peanut Diamond is an upcoming film written and directed by Venkatesh Triparna who is also producing it in association with Abhinav Sardhar under ASP Media House and GV Ideas as Production No.1. Starring Abhinav Sardhar, Ram Karthik, Chandini Tamilarasan, Sherry Agarwal and Shaani Salmon in the lead roles, the film has music by Bengal Tiger Fame Bheems Ceciroleo. J. Prabhakara Reddy is handling the cinematography. Billed to be a unique sci-fi action romance, the film’s first look that was launched by successful director Maruthi got tremendous response. The film’s song…

‘పీన‌ట్ డైమండ్’ ట్రైలర్ విడుదల

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా పీన‌ట్ డైమండ్. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న…

సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్

సీరియల్ నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న పాపులర్ నటుడు సోహైల్. యాంగ్రీ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్ లో అయన చూపించిన ఆటతీరు కు లక్షలాది మంది ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికీ ఆయనను సోషల్ మీడియా లో ఫాలో అవుతూ అయన అభిమానులు సోహైల్ చేసే ప్రతి పోస్ట్ ను లైక్, కామెంట్స్ చేస్తూ ఉంటారు.. బిగ్ బాస్ లో టాప్ 3 లో ఒకరిగా ఉన్న సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు పొందారు.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్నారు.సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు…

సీసీసీ ఆధ్వర్యంలో టీవీ ఆర్టిస్టులకు కరోనా వాక్సిన్

కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. తాజాగా టీవీ ఆర్టిస్టులకు కూడా వాక్సిన్ అందించే కార్యక్రమం సోమవారం నుండి జరుగుతుంది. ఈ వాక్సిన్ డ్రైవ్ లో టివి ఆర్టిస్టులకు కూడా అందించేందుకు సీసీసీ ముందుకు వచ్చిన సందర్బంగా ప్రముఖ నటుడు మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ … సీసీసీ ఆధ్వర్యంలో సినిమా కార్మికులు, ఆర్టిస్టులకు…

గ్లింప్స్ విడుదల చేసిన ‘పెళ్లి సంద‌D’ యూనిట్

కమర్షియల్.. భక్తి రస చిత్రాలతో క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీస్ సహా అన్నివర్గాల ప్రేక్షకులను అల‌రించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. అగ్ర క‌థానాయ‌కులంద‌రితో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించారు. క‌థానాయ‌కుల‌నే కాదు.. ఎంద‌రో హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన గోల్డెన్ హ్యాండ్ ఆయ‌న‌ది. హీరోయిన్స్‌ను ఎంతో అందంగా మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌నంత గ్లామ‌ర‌స్‌గా చూపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అలాంటి శ‌తాధిక ద‌ర్శ‌కుడు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో మ‌రో అందాల భామ‌ను ‘పెళ్లి సంద‌D’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఆ అందం పేరే.. శ్రీలీల‌.ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం(జూన్ 14). ఈ సంద‌ర్భంగా ‘పెళ్లి సంద‌D’ యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. రాఘ‌వేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి…

శ్రుతిహాసన్ ​’సై.. సై’ అంటోంది!?

sye sye antondhi..sruthihasan

​చాలా వేగంగా ఇటీవలి కాలంలో వెబ్ సీరీస్ నిర్మాణం బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుట్టుకురావడం.. కంటెంట్ కోసం పోటాపోటీగా విభిన్న కథాంశాలతో వెబ్ సీరీస్ నిర్మించడం చూస్తున్నాం. బిజీ తారలు సైతం వీటికి సై అంటున్నారు. అదే కోవలో ఇటీవల కథానాయికగా మళ్లీ బిజీ అయిన అందాలతార శ్రుతిహాసన్ కూడా చేరింది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల క్రితం రవి సుబ్రహ్మణ్యం రాసిన పాప్యులర్ నవల ‘ద బెస్ట్ సెల్లర్ షి రోట్’ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నారు. నవలా రచయితగా సూపర్ స్టార్ అయిన ఓ రచయితకు.. అతని యువ ప్రేయసికి మధ్య జరిగే ప్రేమకథగా ఇది రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు…

పవర్ స్టార్ స్పీడు మాములుగా లేదుగా! ?

pawankalyan spood mamuluga ledhugaa?!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… తన రాజకీయ పార్టీ జనసేన కార్యక్రమాలలో ఓవైపు బిజీగా ఉంటూనే.. మరోపక్క సినిమాలలో కూడా స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగులో కూడా ఆయన పాల్గొంటున్నారు. అలాగే, మరోపక్క మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. దీనికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకోపక్క ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమా విషయంలో కూడా పవన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ త్వరలో పవన్ తో ఒక చిత్రాన్ని చేయడానికి…

‘గని’గా వ‌రుణ్‌తేజ్ వస్తున్నాడు

gani in varuntej

మెగాప్రిన్సు వ‌రుణ్ తేజ్ హీరోగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్సు ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.