‘ఐ లైక్‌ టు కిస్‌.. విజయ్‌ దేవరకొండ’ !?

i like to kiss vijay devarakonda : thamanna

తమన్నాను అందరూ మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు లిప్‌లాక్‌ చేయలేదట. వాహ్.. గ్రేట్ కదా! గ్లామర్‌ షో విషయంలో కూడా వెనుకాడని ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఏ హీరోకి లిప్‌లాక్‌ మాత్రం ఇవ్వలేదు. ఇక తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్‌ జామ్‌’ షోలో పాల్గొన్న తమన్నాకు లిప్‌లాక్‌ ప్రశ్న ఎదురైంది. ఇందులో ‘నో కిస్సింగ్‌ ఆన్‌ స్క్రీన్‌ రూల్‌ బ్రేక్‌ చేస్తే.. ఎవరితో కిస్‌ చేయడానికి ఇష్టపడతావు..?’ అని తమన్నాని సమంత ప్రశ్నించింది. దీనికి తమన్నా ‘ఐ లైక్‌ టు కిస్‌.. విజయ్‌ దేవరకొండ’.. అని చెప్పడంతో ఒకటే ఈలలు, చప్పట్లు. అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌.. ఎవరు చూసినా విజయ్‌ దేవరకొండ పేరే చెబుతున్నారంటే.. రౌడీ హీరో రేంజ్‌ ఏంటో…

అమ్మో.. రష్మిక!

ammo.. rashmika!?

సెన్సేషనల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన రష్మిక తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సరసన హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. 1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అతని సరసన కథానాయికగా రష్మిక కనిపించనుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శాంతను బాగ్చి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ..…

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసినట్టే!

rakulpreeth-singh good bye tollywood

టాలీవుడ్‌పై ఫోకస్‌ తగ్గించిన హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేశారు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో ‘యారియాన్’, ‘అయ్యారే’, ‘దేదే ప్యార్ దే’ వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో ‘మే డే’లో రకుల్‌ హీరోయిన్‌గా నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. అదే విధంగా అజయ్‌ దేవగన్‌ ‘థాంక్‌ గాడ్‌’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ యువ నటుడు ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్‌ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న…

సీసీసీ ఆధ్వర్యంలో 4000 మందికి కిపైగా వాక్సిన్ తీసుకున్నారు

డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాడుతూ..కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి…

కళాత్మక దృశ్య కావ్యాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు

శంకరాభరణం , సాగరసంగమం, స్వయంకృషి , స్వాతిముత్యం , ఆపద్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం…

Karthi launches the slick, action-packed trailer of aha’s crime thriller web series, ‘In the Name of God’

karthi launches the slick, action-packed trailer of aha's crime thriller web series, 'In the Name of God'

100% Telugu platform aha is gearing up for the launch of its prestigious, blockbuster series In The Name of God (ING) on June 18. The shocking thriller drama featuring Priyadarshi, Nandini Rai and Posani Krishna Murali in key roles, is directed by Vidyasagar Muthukumar and produced by veteran filmmaker Suresh Krissna. The action-packed trailer of the much-awaited show was launched by multilingual superstar, Karthi. The trailer of In the Name of God is nothing short of a visual treat, bringing together a raw, sizzling mix of emotions, drama, action and…

ఆహా’లో యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్

జూన్ 18న విడుద‌ల హండ్రెడ్ ప‌ర్సెంట్ అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ) జూన్ 18న విడుద‌లవుతుంది. ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. విద్యాసాగ‌ర్ ముత్తు కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ నిర్మించారు. ఈ అవెయిటింగ్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను శ‌నివారం తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స్టార్ హీరో కార్తి విడుద‌ల చేశారు.ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ)డ్ వెబ్ సిరీస్‌ చ‌క్క‌టి విజువ‌ల్ ట్రీట్‌గా, రా కంటెంట్‌, ఎమోష‌న్స్‌, డ్రామా, యాక్ష‌న్, చ‌క్క‌టి డైలాగ్స్ క‌ల‌బోత‌గా ఉంది. ఆది(ప్రియ‌ద‌ర్శి)…

‘మనం సైతం’ నిత్యావసర వస్తువుల పంపిణీ

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని “మనం సైతం” సేవా సంస్థ ఇవాళ జూనియర్ ఆర్టిస్ట్ లకు నిత్యావసరాలను అందించింది. హైదరాబాద్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని అనిల్, వినోద్ బాల, శ్రీను గౌడ్, స్వామి గౌడ్ , రవి, అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ నిత్యావసరాల పంపిణీకి చదలవాడ శ్రీనివాసరావు, యూకే రామ్ నామగిరి, పీఎస్ఎన్ రాజు, డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు, బి కనకదుర్గమ్మ, సత్య శ్రీకృతి, డైరెక్టర్ దశరథ్, సంపత్ స్టూడియో, జొన్నాదుల సుధాకర్, ప్రభంజన్, తోటకూర రఘు, ఎంఎస్ఎం ఉమాకాంత్, దర్శకుడు జి నాగేశరరెడ్డి, వాకాటి నరసింహస్వామి తదితరులు తమ సహకారం అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…షూటింగ్స్ లేక మా జూనియర్ ఆర్టిస్ట్ సోదరులు ఎంతో…

‘నల్లంచు తెల్లచీర’ నేసేందుకు మళ్లీ మెగాఫోన్ పట్టిన రైటర్ యండమూరి వీరేంద్రనాధ్

తనదైన కాల్పనిక సాహిత్యంతో ఇప్పటికీ లక్షలాదిమందిని ఉర్రూతలూగిస్తూ… ‘వ్యక్తిత్వ వికాస రచనలతో’ వేలాది జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “నల్లంచు తెల్లచీర”. ఈ పేరుతో యండమూరి కలం నుంచి జాలువారిన ఓ నవల ‘దొంగ మొగుడు’ పేరుతో మెగాస్టార్ చిరంజీవితో రూపొంది అసాధారణ విజయం సాధించడం తెలిసిందే. చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన ‘అభిలాష, ఛాలెంజ్, మరణమృదంగం, రాక్షసుడు” చిత్రాల రచయిత యండమూరి అనే విషయం ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పనిలేదు.యండమూరి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న “నల్లంచు తెల్లచీర” చిత్రాన్ని ‘ఊర్వశి ఓటిటి’ సగర్వ సమర్పణలో.. సంధ్య స్టూడియోస్-భీమవరం టాకీస్ పతాకాలపై రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.అమర్ కార్యనిర్వాహక…

రఘు అక్రమ అరెస్టును నిరసిస్తూ జర్నలిస్టులు ధర్నా

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం లో తమ బతుకులు మారుతాయని నాడు జర్నలిస్ట్లు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక విలేకరుల సంక్షేమం మాటేమో గానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా రఘు అరెస్టుతో రిపోర్టర్ ల పట్ల ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అయింది అన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని జర్నలిస్టుల పట్ల కక్ష్యసాధింపులను మానుకోవాలని హితవు పలికారు. అక్రమంగా అరెస్టు…