ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కె. ఎం.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన మొదటి సినిమాతో కుమార్ ఒక వైవిధ్యమైన కథను ఎంచుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరు పొందిన ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ…
Category: FILM NEWS
అలుపెరగని బాటసారి మహమ్మద్ షరీఫ్
–గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం– (టాలీవుడ్ టైమ్స్ – స్పెషల్ బ్యూరో)ఓ దృశ్యం పండాలంటే .. ముందుగా సదరు దర్శకుడు తన మనో పలకంపై దాన్ని చిత్రించుకోవాలి. పాత్రలు, వాటి స్థాయీ బేధాలనూ విశ్లేషించుకుంటూ కథానుగుణమైన రీతిలో సన్నివేశ చిత్రీకరణ చేయగలగాలి. అలాంటప్పుడే ఏ సన్నివేశమైనా తెరపై పూర్తిగా పండుతుంది. ప్రేక్షకుల హృదయాల్లోనూ నిలిచిపోతుంది. అయితే మనకు ఇలాంటి నిష్ణాతులు ఉన్నారా? ఉంటారా? ఒకేసారి అనేక కథలను తెరపై మలిచేందుకు ఒప్పుకున్నప్పుడు అన్నింటికీ న్యాయం చేయగలిగే తీరిక , ఓపిక.. అన్నింటికీ మించి తాను అనుకున్న రీతిలో తీయగలిగే పరిస్థితి వారికి ఉంటుందా? ఇలా అష్టావధానాలు చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలోనూ బహుకొద్ది కొందరి జాబితాలోకి వచ్చే వ్యక్తి మహమ్మద్ షరీఫ్. ఆకాశమే హద్దుగా వచ్చిన అవకాశాన్ని విడవకుండా, వాటికి సమపాళ్లలో పూర్తి న్యాయం చేస్తూ తనకంటూ…
విజయాలకు చిరునామా కడెంపల్లి శ్రీరాములు గౌడ్
టాలీవుడ్ టైమ్స్ – స్పెషల్ బ్యూరో: అవగాహన, ఆసక్తితో పాటు తను అనుకున్న తీరాన్ని చేరుకోవాలనే తపన, కసి, పట్టుదల మనసులో బలంగా నాటుకుపోయి ఉంటే ‘విజయం’ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందనేది మహానుభావుల మాట. ఇది ఎందరో పెద్దలు చెప్పిన మాటే అయినా.. అది మనకు ఓ చద్ది మూటలాంటిది. ఆ మూటలోనే మనం.. మన భవిష్యత్తుని వెతుక్కుంటాం. మన జీవన ప్రయాణాన్ని సాగిస్తాం. అలా సాగిన ఒడిదుడుకుల ప్రయాణంలో మన గమ్యం ఎటువైపునకు దారి తీస్తుందో.. ఎవరికీ అంతుపట్టదు. లెక్కకు మించి ఆలోచనలు, అంతకుమించి ఏదో అయిపోవాలన్న ఆరాటం.. ఎక్కడికో చేరాలన్న కసి, ఊహకందని గమ్యంవైపునకు మనల్ని నిరంతరం లాక్కెళుతూనే ఉంటుంది. అదే మరి జీవితమంటే! ఆ జీవితంలో చాలామంది తమ ‘గోల్’ ఏంటో.. తమ అడుగులు ఎటువైపునకు వేయాలో తెలియకుండానే ప్రయాణాన్ని సాగిస్తుంటారు.…
సి.వి.రత్నకుమార్ కు తమిళ యూనివర్సిటీ డాక్టరేట్
సేంద్రియ వ్యవసాయం చేసి , అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తూ, రైతుల పాలిట బయో పితామహుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన, రాన్సాక్ ఆర్గా సీ.ఈ.ఓ డా. సి.వి.రత్నకుమార్ కు ప్రతిష్టాత్మకమైన, తమిళ యూనివర్సిటీ చెన్నై ,గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు చింతలచెరువు రత్నకుమార్, గత 30 ఏళ్లుగా, సేంద్రియ వ్యవసాయ విధానంపై, ఎప్పటికప్పుడు, విస్తృత పరిశోధనలు చేసి ,ఆ దారిలో రైతులను ప్రోత్సహిస్తూ రాన్సాక్ ఆర్గా ద్వారా ,వారికి ప్రయోజనమైన ,సేంద్రియ ఎరువులను అందించి, మంచి ఫలితాలు సాధించి పెట్టినందుకు, ఆయనకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్ట్లు, తమిళ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటర్ నేషనల్ అనుబంధంగా కొనసాగుతూ, విశేష పేరు ప్రఖ్యాతులు సాధించిన ,ఈ యూనివర్సిటీ గతంలో ఎందరో మహామహులకు ,డాక్టరేట్ లు అందించింది. ఈ యూనివర్సిటీ…
తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’
ప్రముఖ చిత్ర నిర్మాత, ఫిలిం మేకర్ మామిడాల శ్రీనివాస్ తో ‘ఫేస్ 2 ఫేస్’ “తెలంగాణలో గొప్ప కథలున్నాయి, సంగీతం ఉంది. భాషా సంస్కృతులున్నాయి. ఎలాగైతే బెంగాల్ లో, కేరళలో రీజినల్ సినిమా ఎదిగిందో అలాగే తెలంగాణ సినిమాకి కూడా విస్తృతంగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునే శక్తి సామర్ధ్యాలున్నాయి. అయితే తెలంగాణ సినిమా తనదైన ప్రాంతీయ లక్షణాల్ని పుణికి పుచ్చుకోవాల్సివుంది. కథల పరంగాను.. కళాత్మకంగాను తెలంగాణ ముందున్నప్పటికీ.. సినిమా సాంకేతికత తోడైన కళ గనుక తెలంగాణ యువత ఫిలిం టెక్నాలజీలో ఉన్నతస్థాయి శిక్షణ పొందాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సినిమా ఎల్లలు దాటి ముందుకు వెళ్లగలుగుతుంది. అలాగే కొత్త ఆలోచనలకు, కొత్త భావాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపార సినిమాకి వున్న మూసకట్టు సూత్రాలకు భిన్నంగా తెలంగాణ చలన చిత్రకారులు ఆలోచించాల్సి ఉంది”…
సారిపల్లివారికి వందనాలు
శిరోమణి డా॥ వంశీ రామరాజు, డా॥ తెన్నేటి సుధ అతడు మానవతకు ప్రతీకప్రశాంతవదనంతో శోభించే ఆయనకుచిరునవ్వే ఆభరణంరంగస్థల, జానపద కళాకారుల పాలిట కల్పవృక్షంవంశీ వేగేశ్న దివ్యాంగుల ఆశ్రమానికిఐదు లక్షలు ఇచ్చిన శాశ్వతనిధి దాతవైద్యశాలకు వచ్చే రోగులసంరక్షణకు బాధ్యత వహిస్తున్న స్ఫూర్తిదాతఅజాతశత్రువుగా ఎల్లరకుప్రేమను పంచే ఆత్మీయతా సింధువుమనసంతా సేవాపరాయణతఅంతర్లీనంగా ఆధ్యాత్మికతప్రవహించే భక్తి స్రోతస్వినికార్యదక్షత, నిరంతరకృషితోఆదర్శంగా నిలిచిన విశిష్టమూర్తిఅతడు మా కుటుంబానికిఅత్యంత ఆత్మీయుడుసారిపల్లి కొండలరావు మహోదయుడువారి జన్మదినంమావంటివారందరికీ శుభదినం81వ జన్మదినం సందర్భంగామీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలుభగవంతుడు మీకు నిండు నూరేళ్ళుఆయురారోగ్యాలు ప్రసాదించాలనిమీ కుటుంబమంతాఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
జయహో.. సాంస్కృతిక బంధువు శ్రీసారిపల్లి కొండలరావు గారు
-డాక్టర్ మహ్మద్ రఫీ డిజిటల్ చిత్రం: అనుపోజు ప్రభాకర్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళాకారులకు అయన ఆత్మీయ బంధువు! అందుకే ఆయన సాంస్కృతిక బంధువు గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం! చేతికి ఎముక లేని మనస్తత్వం! ఎంత సంపద వున్నా ఎంతో నిరాడంబరత్వం! ఆ గొప్ప మానవతావాది, మనుషుల్లో దేవుడ్ని చూసే తత్వవేత్త, వదాన్య వరేణ్య మరెవరో కాదు…ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సారిపల్లి కొండలరావు!గత పాతికేళ్లుగా అక్కినేని నాటక కళా పరిషత్ వ్యవస్థాపక చైర్మన్ గా నాటక రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, కళా రంగానికి కనిపించే దేవుడు డాక్టర్ కె.వి.రమణాచారి గారి స్ఫూర్తి తో వారి సూచన మేరకు గత మూడున్నరేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జానపద…
కియారాకు నచ్చింది అతడేనట!
అతడే దమ్మున్న హీరో.. మహేష్ బాబు ‘భరత్అనే నేను’ తో దక్షిణాదిలో, ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్‌సింగ్’ తో బాలీవుడ్ లో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది కియారా అద్వాణీ. ” కెరీర్ తొలినాళ్లలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని..‘కబీర్‌సింగ్’ విజయం తన వ్యక్తిత్వాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని చెబుతోంది ఈ పంజాబీ సుందరి. ‘ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మనం ఏవిధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. విజయాల్లోనే వినమ్రంగా ఉండటం అలవర్చుకోవాలి. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కాబట్టి.. విజయం ఎంత విలువైనదో నాకు బాగా తెలుసు. అనుక్షణం దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అదీ మంచిదే. ‘భయం’ ‘బాధ్యత’ను నేర్పుతుంది. ‘స్ట్రాంగర్’గా, ‘బెటర్’గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది”…అని చెప్పింది. ఒకప్పుడు సినిమా ఫలితం ఎలా…
వీళ్లు ముగ్గురూ..ముగ్గురే!
పూజా హెగ్డే.. కీర్తి సురేష్..రష్మిక మందన్న తెలుగు చిత్రసీమలో కథానాయికల గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం మనం ముగ్గురి గురించే చెప్పుకోవాలి. ఆ ముగ్గురూ ఎవరో కాదు.. పూజా హెగ్డే.. రష్మిక మందన్న, కీర్తి సురేష్. వీళ్లు ముగ్గురూ..ముగ్గురే! తమ అందచందాలతో టాలీవుడ్ ని తమ వైపునకు తిప్పుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి భామల టైం నడుస్తుంది. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ ని కుదుపేస్తున్నారని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీరిలో పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు అయితే మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేసేస్తూ తోటి తారలకు ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు. అంతే కాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అనే ప్రచారం ఇండస్ట్రీ…
అందుకే తాప్సీ వాటిని వదులుకోవాల్సి వచ్చింది?!
నన్ను బికినీలో చూడటానికి నా అభిమానులు ఇష్టపడరని అంటోంది తాప్సీ. ప్రతిఒక్కరికీ వారి ఎంపికలు ఉంటాయి. బికినీ ధరించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. బికినీ నాకు సౌకర్యంగా అనిపించదు. ఎందుకంటే నా అభిమానులకు నేను అలా కనిపించడం నచ్చదు అని చెప్పింది. ప్రారంభ చిత్రాల్లో తాప్సీ బికినీ ధరించినప్పుడు తనకు ఎదురైన అనుభవాల రీత్యా తాను కూడా అసౌకర్యం ఫీలవుతోందని అర్థమవుతోంది. అన్నట్టు పింక్ – నామ్ షబానా అంటూ తన ఇమేజ్ ని తానే మార్చేసుకుంది. గ్లామర్ నాయికగా కంటే రెబల్ యాటిట్యూడ్ ఉన్న యాక్షన్ నాయికగానే తాను పాపులరైంది. ఇప్పుడు బికినీ వేసినా ఎవరూ పట్టించుకోరు. తనకంటూ అర్థవంతమైన కాన్సెప్టులతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తాప్సీ నటిస్తున్నవి కూడా అలానే ఉన్నాయి. రష్మి రాకెట్-హసీనా దిల్ రుబా ఇవన్నీ నటనకు…
