కియారాకు నచ్చింది అతడేనట!

kiyaraku nachhindhi athadenata
kiyaraku nachhindhi athadenata
Spread the love

అతడే దమ్మున్న హీరో..

మహేష్ బాబు ‘భరత్అనే నేను’ తో దక్షిణాదిలో, ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్‌సింగ్‌’ తో బాలీవుడ్‌ లో స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది కియారా అద్వాణీ. ” కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని..‘కబీర్‌సింగ్‌’ విజయం తన వ్యక్తిత్వాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని చెబుతోంది ఈ పంజాబీ సుందరి. ‘ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు మనం ఏవిధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. విజయాల్లోనే వినమ్రంగా ఉండటం అలవర్చుకోవాలి. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కాబట్టి.. విజయం ఎంత విలువైనదో నాకు బాగా తెలుసు. అనుక్షణం దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్‌ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అదీ మంచిదే. ‘భయం’ ‘బాధ్యత’ను నేర్పుతుంది. ‘స్ట్రాంగర్‌’గా, ‘బెటర్‌’గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది”…అని చెప్పింది. ఒకప్పుడు సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని భయం కలిగేదని, ఇప్పుడు రిజల్ట్‌ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టిపెడుతున్నానని చెప్పింది. తన ఉన్నతిలో దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ కీలకభూమిక పోషించారని..ఆయన దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంలో నటించాలన్నది తన కోరిక అని చెప్పింది. అలాగే సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉంది. నేను ‘తప్పనిసరిగా నటించాలి’ అనుకునే హీరో రణ్‌వీర్‌సింగ్‌. అతడే దమ్మున్న హీరో. ఇక హీరోయిన్‌లలో ఆలియా భట్, దీపికా పదుకొనేలతో కలిసి నటించాలని ఉంది…అని చెప్పింది.