బహుభాషా కోవిదుడు.. అసాధారణ ప్రజ్ఞా దురీణుడు స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు బయోపిక్ ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో “శ్రీశైలం” చిత్రాన్ని నిర్మించారు. పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త-ప్రముఖ సీనియర్ దర్శకుడు ‘ధవళ సత్యం’ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. “ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లో… జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని… ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Category: FILM NEWS
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు
టీఆర్ఎస్ అరాచకాలకు ఇక ముగింపు:టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో-ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి టాలీవుడ్ టైమ్స్ న్యూస్ -హైదరాబాద్ టీపీసీసీ సారధి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో- ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లుగా కేసీఆర్ కుటుంబ అరాచకం, ఇటు ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి దంపతుల భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్దేశకత్వంలో గొంగిడి దంపతుల అరాచకాలమీద అన్ని వేదికల మీద పోరాడుతామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నడుస్తూ, పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా పని చేస్తా అని అయోధ్య రెడ్డి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన…
మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం : విష్ణు మంచు
‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవిష్ణు మంచు నమస్కారం..‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో ఋణపడి ఉన్నాము. ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.మా నాన్నగారు ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్…
ఘనంగా జంపాల దశరథ కూతురు వివాహం
హాజరైన ప్రముఖులు టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బహదూర్ పేట్ మాజీ సర్పంచ్ జంపాల దశరథ కూతురు వివాహం ఆదివారం స్థానిక ఆలేరు ప్రకాష్ గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహమహోత్సవానికి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఈ వివాహమహోత్సవారంలో జంపాల దశరథ అన్న జంపాల శ్రీను, ఆలేరు బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్, 5వ వార్డ్ కౌన్సిల్ సంగు భూపతి, పట్టణ కార్యదర్శులు కళ్లెం రాజు గౌడ్, అయిలి సందీప్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఆలేరులో మిన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
రేవంత్ రెడ్డి తెలంగాణ టి.పి.సి.సి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన శుభవేళ.. టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరురేవంత్ రెడ్డి తెలంగాణ టి.పి.సి.సి నూతన అధ్యక్షుడుగా నియమితులైన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు మిన్నంటిపోయాయి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. ఎజాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రథసారథులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలేరు కాంగ్రెస్ భవనం ముందు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టి పి సి సి జనరల్ సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరు ఎంపీపీగంధమల్ల అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ, నీలం వెంకటస్వామి, కొండరాజు వెంకట్ రాజు, చింతలఫణి శ్రీనివాస్ రెడ్డి, కట్టె గుమ్ముల విద్యాసాగర్ రెడ్డి, ఎం.డి. జైనొద్దీన్,…
‘మా’ ఎన్నికల్లో రంగంలోకి తెలంగాణ కళాకారుల ప్యానెల్
‘మా’ ఎన్నికల్లో తెలంగాణ కళాకారులు ప్యానెల్ రంగంలోకి వచ్చింది. ప్రముఖ నటుడు శ్రీ CVL నరసింహారావు గారి ప్యానెల్ ఇది. ఆయనే అధ్యక్ష అభ్యర్థి. త్వరలో మిగిలిన సభ్యులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
రెగ్యులర్ షూటింగ్‌లో ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’
ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘మస్కా’,‘ఆట’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా ట్రెండీగా, అదే విధంగాయువతకు చక్కటి సందేశాన్నిస్తూ కొత్తగా ఉందని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఎంఎస్ రాజు ప్రతిభను అందరూ ప్రశంసించారు. ‘డర్టీ హరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో…
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, SLV Cinemas LLP Production No 4 Shoot Begins From July 1st
Mass Maharaja who introduced many talented directors to the industry and is riding high with the success of Krack will be teaming up with another debut director Sarath Mandava who previously worked as a writer for films of several top stars of south India.Billed to be a unique thriller with story inspired from true incidents, Ravi Teja plays a never-seen-before role in the movie where he will be seen romancing Divyansha Koushik of Majili fame.Sudhakar Cherukuri will produce the yet to be titled flick under SLV Cinemas LLP. Sam CS…
జులై 1నుండి రవితేజ, శరత్ మండవ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విషయం తెలిసిందే..రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నారు దర్శకుడు శరత్ మండవ. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుండి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అందరూ పాల్గొననున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.దర్శకుడు శరత్ మండవ మన తెలుగు వారే…గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం
టాలీవుడ్ టైమ్స్ – హైదరాబాద్‌తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా నియమించింది.
