‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ‘కొండపొలం’ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్ణవ్ తేజ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘కర్నూలులో ఉన్న అభిమానులందరికీ థ్యాంక్స్. నాకు కర్నూలు జిల్లా అంటే చాలా ఇష్టం. మంత్రాలయం, శ్రీశైలం, జోగులాంబ ఇలా నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆత్యన్యూనత భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని నేను కంపోజ్ చేశాను. ఇక్కడకు వస్తూ వస్తూనే ఓ…
Category: FILM NEWS
ప్రకాశ్ రాజ్‌కు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘీబావం
ఈ నెల 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్ రాజ్ తరపు నుండి పూర్తి సహకారం కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజు ఏపీ మా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేను విశ్వ నటుడిగా ఉన్నాను. కనుక ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గాను సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాము. అన్ని రాష్ట్రాల్లోని కళాకారుల పరిస్థితి ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ను కర్ణాటకలో విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర
జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన “జైసేన” చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు.శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన “జై సేన” చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన “జై సేన” కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం:…
సెన్సార్ సన్నాహాల్లో “ఎక్కడికో ఈ అడుగు’
‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో… ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన “ఎక్కడికో ఈ అడుగు” అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్…
సెన్సార్ కార్యక్రమాల్లో ‘1948 – అఖండ భారత్’
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం తాజా పోస్టర్ ను రిలీజ్ చేశారు.అలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించగా సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు. గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “జనసేన”ను కర్ణాటకలో విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ‘మైదాన్’ విడుదల
ప్రపంచం లో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపధ్యం లో యదార్ధగాద ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ప్రపంచ పటం లో ఫుట్ బాల్ ఆట రంగాన్ని భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్ నిజజీవిత కథతో ఈ చిత్రం తెరెకెక్కుతుంది. జీవితం లో నైనా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తే గాని విజయం వరిస్తుంది. క్రీడా నేపధ్యం లో స్ఫూర్తివంతమైన కథగా మైదాన్ నిర్మించబడింది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ గత ఏడాది రెండు సార్లు విడుదల తేదీ ని కూడా ప్రకటించారు . అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆయా తేదీలలో విడుదల…
అక్టోబర్ 9న వస్తున్న ‘తీరం’ మంచి సక్సెస్ అవ్వాలి : మైటీ స్టార్ శ్రీకాంత్
అకి క్రియేటివ్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు పై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ నాయికా నాయకులుగా యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 9న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.. కాగా ఈ చిత్రం టీజర్ ను శత చిత్రాల కథానాయకుడు మైటీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, శ్రావణ్ వైజిటి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, నటులు అజయ్, ఇజాజ్ జాన్, సునీల్ ఉప్పిరెట్ల, జై, కెమెరామెన్ శ్రవణ్ జి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిజె తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్…
`నాట్యం` రెండో పాట విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా నాట్యం సెకండ్ సాంగ్ పోనీ పోనీ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ”రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు…
అక్టోబర్ 8న ‘నేను లేని నా ప్రేమకథ’ విడుదల
త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఎ.భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం UFO Moviez INDIA LIMITED ద్వారా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సంగీత ప్రేమకథా చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా.. నవీన్ చంద్ర మరియు గాయత్రి సురేష్ మరియు నూతన పరిచయం క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ తారాగణంగా కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో ఈ చిత్రం నిర్మించబడింది. ఇటీవల జెమినీ రికార్డ్స్(మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర సంగీతం శ్రోతలను, సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది. వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం నిర్మించబడిందని, అలాగే మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న UFO Moviez వారికి ప్రత్యేక…
