నవంబరు 14న గాన గంధర్వుడి సుస్వరార్చన

november 14na ghanagandarvudi suswararchana

100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు పాల్గొంటారు. సంతోషం – సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినవి. సంతోషం – సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేదికపై ఈ అపురూప ఘట్టం దర్శనమివ్వనుంది. హైదరాబాద్ నోవాటెల్ లో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన ప్రారంభమవుతుంది. సంతోషం – సుమన్ టీవీ ఈ స్వరార్చనను సమర్పిస్తున్నాయి. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ కు నాంది పలకనున్నారు. బాలు పాటల్లో…

‘మిషన్ 2020’ టీమ్‌కు ‘దర్జా’ మూవీ టీమ్ అభినందనలు

mishhon2020 telugu movie

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. గతంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలను తెరకెక్కించిన కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 29 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ‘దర్జా’ మూవీ టీమ్ పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపింది. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి…

‘రాంగ్ స్వైప్’ : డా.రవికిరణ్ ప్రతిభకు నిలువుటద్దం

the wrong swipr telugu movie

డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో ‘మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్’ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే… ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది. స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్… సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు… ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ… ”లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన…

కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు

kannada hero punith rajkumar no more

కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు వెంటనే విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు విక్రమ్‌ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’…

ఇండియన్ ఆయిల్ కార్పొరేష‌న్‌ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వి. సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకర‌ణ‌

sathishkumar

భారతదేశపు అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వీ సతీష్ కుమార్ (56) బాధ్యతలు స్వీకరించారు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టింగ్‌లలో ఒక‌టైన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా అధిరోహణకు ముందు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు వ్యాపార అధిపతిగా ఉన్నారు. రిటైల్, డైరెక్ట్ సేల్స్, ఎల్‌పీజీ, ల్యూబ్ సేల్స్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్, హెచ్ఆర్‌డీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పర్యవేక్షించేవారు. ఎల్‌పిజీ వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటిఎల్), ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై), బీఎస్-6 ఇంధనానికి మారడం వంటి కీలక వ్యాపార కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అతను దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా నైపుణ్యాన్ని బోర్డుకి తీసుకువచ్చారు.సతీష్ కుమార్ ప్రస్తుతం బెక్సిమ్‌కో…

పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్రోత్‌ 3.0ను విడుదల చేసిన NXTDIGITAL

NXTDIGITAL

తమ నెట్‌వర్క్‌ను 40 నూతన NXTHUB లతో దేశవ్యాప్తంగా విస్తరణ : తమ యాప్స్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటన భారతదేశ వ్యాప్తంగా 40 నూతన NXTHUBs ఏకకాలంలో ప్రారంభం – ప్రతి ఒక్కటీ 650కు లైవ్‌ టీవీ ఛానెల్స్‌ మరియు బ్రాండ్‌బ్యాండ్‌ అందిస్తాయి. ప్రస్తుతం 4400 పిన్‌కోడ్స్‌ వ్యాప్తంగా NXTDIGITAL కు ఉన్న ప్రస్తుత కవరేజీకి జోడింపు•ప్రతి NXTDIGITAL సొంతమైన మరియు నిర్వహిస్తున్న NXTHUBs లోనూ యాడ్స్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది లాస్ట్‌ మైల్‌ ఓనర్స్‌ (LMOలు)కు ప్లగ్‌ అండ్‌ ప్లే పరిష్కారం అందిస్తుంది. ఈ వీడియో పరిష్కారం HITS లేదా Headend-In-The-Sky సాంకేతికత ఆధారంగా ఉంటుంది. ఇది శాటిలైట్‌ ఆధారితం కావడంతో పాటుగా వాతావరణం, భౌగోళిక పరిస్థితులు లేదా కనెక్టివిటీ అవరోధాలు ఉండవు.•హెడ్‌–ఎండ్స్‌ లేదా సంబంధిత సాంకేతికలో ఎల్‌ఎంఓలు…

‘తీరం’ ప్రీ- రిలీజ్ ఈవెంట్ : అక్టోబర్ 29న విడుదల

theeram pre relese event

యంగ్ టాలెంటెడ్ హీరోస్ శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అఖి క్రియేటివ్స్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు పై అనిల్ ఇనమడుగు దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 29న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.. ఈ సందర్బంగా.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 27న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిస్టెన్ రవళి, సంగీత దర్శకుడు ప్రశాంత్ బిజె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణు, పైనాన్షియర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత యం. శ్రీనివాసులు, శ్రీమతి మమత, తదితర చిత్ర…

I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers: icon star Allu Arjun

I hope Varudu Kaavalenu brings back audiences to theatres in huge numbers: icon star Allu Arjun

One of the most awaited Telugu films of the year, Varudu Kaavalenu, is all set to hit theatres on October 29. Starring Naga Shaurya, Ritu Varma in the lead roles, the family entertainer marks the directorial debut of Lakshmi Sowjanya. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, the leading banner associated with hit films like Jersey, Premam, Bheeshma and the upcoming Pawan Kalyan, Rana Daggubati multi-starrer Bheemla Nayak. The beautiful trailer, memorable songs by Thaman and Vishal Chandrasekhar, the terrific chemistry between Naga Shaurya and Ritu…

అబ్రార్ ఖాన్ కు చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఉంది : ‘ఓ మధు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాజీ మంత్రి డా. కె. నగేష్

o madhu pree relese event

బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ.యమ్ ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. కుడుదుల నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి.లక్ష్మణ్ తదితర సినీ,రాజకీయ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ”ట్రైలర్ చాలా బాగుంది. మా ముందు పుట్టి పెరిగిన…

నవంబర్ 12న ‘పుష్పక విమానం’ విడుదల

nove 12 na pushpaka vimaanam vidudhala

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు “పుష్పక విమానం” చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా “పుష్పక విమానం” సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న “పుష్పక విమానం” ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాకు…