నవంబర్ 12న ‘పుష్పక విమానం’ విడుదల

nove 12 na pushpaka vimaanam vidudhala
nove 12 na pushpaka vimaanam vidudhala
Spread the love

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు “పుష్పక విమానం” చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా “పుష్పక విమానం” సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న “పుష్పక విమానం” ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది.
“పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.
టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర