తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు

Hemambar Jasti Director

ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబ‌ర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబ‌ర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్ట‌ర్‌గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…

క్రిస్మస్ మనదే : శ్యామ్ సింగ రాయ్ హీరో నాని

Shyam Sigharai Movie still

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ తరువాత నాకు వెంకట్ గారు మొదట అడ్వాన్స్ ఇచ్చారు. లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా తీయమని అన్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మీద మున్ముందు చాలా మంచి సినిమాలు రాబోతోన్నాయి. వెంకట్ గారికి ఈ చాన్స్ ఇచ్చినందుకు నానికి థ్యాంక్స్. ట్రైలర్ చూస్తుంటేనే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతోంది. ఆల్…

ఏ.ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్-1 ప్రారంభం

A R Movie mekars opining

ఏ సురేష్ ప్రభు సమర్పణలో ఏ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్, శీతల్ బట్ హీరో హీరోయిన్లు (నూతన పరిచయం) గా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏ.ఆర్ రాకేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర నిర్మాత ఏ ఆర్ రాకేష్ మాట్లాడుతూ ..సినిమా రంగంపై ప్రేమతో చాలా రోజుల నుండి సినిమా తీయాలనే ఆలోచనతో ఉండగా సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా…

NSUI ఆధ్వర్యంలో ఆలేరులో ఇంటర్మీడియట్ కళాశాలలు బంద్

NSUI ALER NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో NSUI ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ.. మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను NSUI ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగిందని చెప్పారు.

విజయ్ ఆంటోనీ హీరోగా ఎమోషన్ థ్రిల్లర్‌ ‘విక్రమ్ రాథోడ్’

Film News

విజయ్ ఆంటోనీ… తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం ఉంది. టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. బిచ్చగాడు చిత్రం నుంచే విజయ్ ఆంటోనీ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది.తాజాగా మరొక డీఫ్రెంట్ కథాంశంతో “విక్రమ్ రాథోడ్” గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెప్సి శివ సమర్పణలో విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా, రెమిసెస్ హీరోయిన్ గా సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు నటీ, నటులుగా తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్‌ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమాను తెలుగులో “విక్రమ్ రాథోడ్” అనే టైటిల్‌తో డబ్ అవుతోంది ఈ సినిమాను…

‘దీనశరణ్య’ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అవగాహన

Dheena Sharanya News

సికింద్రాబాద్ లోని మహబూబ్ డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన కార్యక్రమం దీనశరణ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జెస్వాల్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగములో అయినా ముందుగా చేరి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వివరించారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు చింతల సాయి బాబా మాట్లాడుతూ సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రభుత్వం నిర్బహించే స్టడీ సర్కిల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏసీపీ బీ రమేష్, హైకోర్టు న్యాయవాదులు గ్లోరీ ఆనంద, సంపత్ కుమార్, రాజు, మొటివేటర్ దాసి శంకర్, నాయకులు…

Pushpa Movie Review In Telugu : ‘పుష్ప’ : ఫ్యాన్స్ కి పండగే!

Allu Arju Pushpa Still

చిత్రం: ‘పుష్ప- ది రైజ్’ విడుదల : డిసెంబర్ 17, 2021 Tollywoodtimes రేటింగ్ : 2./5 నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, శత్రు, అనసూయ భరద్వాజ్ తదితరులు రచన, దర్శకత్వం: సుకుమార్ నిర్మాణం : మైత్రీ మూవీస్ -ముత్తంశెట్టి మీడియా నిర్మాతలు : నవీన్ ఏర్నేని- వై రవిశంకర్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : మిరోస్లా క్యూబా బ్రోజెక్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రూబెన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటిభాగాన్ని ‘పుష్ప- ది రైజ్’ పేరిట నేడు (డిసెంబర్‌ 17)న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మైత్రీ…

కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం

TUWJ NEWS

హైదరాబాద్ : కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం (డిసెంబర్ 15) రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న,ఎమ్మెల్యే క్రాంతి కుమార్ లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఈ చెక్కులను పంపిణీ చేసారు. వీరికి ఐదేళ్ల పాటు పెన్షన్ ను కూడా ప్రతి నెలా వారి వారి అకౌంట్ లలో ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీయూడబ్ల్యూజే (ఐ జే యు) ప్రాథమిక సభ్యులు ఆరుగురు కరోనా బారినపడి మృతి చెందగా మరో ఇద్దరు అనారోగ్యం కారణంగా మొత్తం ఎనిమిది మంది…

సమంత ‘యశోద’లో వరలక్ష్మీశరత్ కుమార్

Varalakshmi-Sarathkumar

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ ఈ నెల 6న ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రలో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్ కనిపిస్తారు. నేటి నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ…

ఎమ్మెల్సీ ఎల్.రమణకు బొట్ల పరమేశ్వర్ అభినందనలు

Botla Parameshwar-L Ramana

-అరుదైన వ్యక్తుల జాబితాలో ఎల్.రమణగారికి చోటు హైదరాబాద్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణకు యాదాద్రి భువనగిరి జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ శుభాభినందనలు అందజేశారు. ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ గారి గెలుపు కరీంనగర్ ప్రాంత ప్రజలకు శుభసూచకమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బొట్ల పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆరూ.. కారుకే రావడం ఆనందదాయకమన్నారు. పెద్దల సభకు ఎల్‌.రమణ గారు బోణీ కొట్టారని, శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందనిపేర్కొన్నారు. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు సీట్లను ఇప్పటికే ఏకగ్రీవంగా…