కొత్త జంటలపై ఆసక్తి !

new look jantalau

టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి 2022 ప్రారంభంలో తమ చిత్రాలద్వారా కనువిందు చేసే కొత్త జంటలపై పడింది. అందరినీ ఉత్తేజపరిచే ఈ ఆన్‌స్క్రీన్ జోడీలతో ఆసక్తి నెలకొంది. ఈ 2022 ఖచ్చితంగా బాలీవుడ్‌-టాలీవుడ్ లో కొత్త జంటలు మరియు కొత్త వెండితెర జోడీల సంవత్సరం కానుంది. థియేటర్ల పునఃప్రారంభం.. ఓటీటీ చలనచిత్రాల ప్రవాహం మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్‌కు దారితీసింది. తద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని నటులు, నటీమణులను వెండితెరపై వీక్షించబోతున్నాం. ఆ జంటలేమిటో ఓసారి లుక్కేద్దాం… రామ్ చరణ్- అలియా భట్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’లో రామ్ చరణ్- అలియా భట్ జంట కన్నులపంట కానుంది. ఈ జోడీ కోసం సినీ ప్రేక్షకులే కాదు.. అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాఫ్ట్ అండ్ విధేయత కలిగిన అలియా…

ఇక తెలుగు సినిమాల జాతర షురూ..!

Tollywood Cinemala jatara shuroo...!!

తెలుగుచిత్రసీమలో తదుపరి సినిమాల జాతర షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవ కళ్యాణ్ ధైర్యం చేయడంతో ఫిబ్రవరి నుంచి సమ్మర్‌ వరకు `ఆర్‌ఆర్‌ఆర్‌, `రాధేశ్యామ్‌`, `సర్కారువారిపాట`, `భీమ్లా నాయక్‌`, `ఆచార్య’ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `భీమ్లా నాయక్‌`, `సర్కారు వారి పాట`, `రాధేశ్యామ్‌` చిత్రాలు వాయిదా పడ్డసంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్లు సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి ప్రేక్షకులకి సినిమా పండగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా సంక్రాంతికి రావాల్సిన పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌` వాయిదా పడిన విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`,…

జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’ ప్రి రిలీజ్ ఈవెంట్… 21న సిరీస్ స్ట్రీమింగ్!

pre-release of ZEE5 Originals LOSER Season 2 Web Series.

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరి కళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’తో వీక్షకుల మనసులు గెలుచుకుంది.ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది’.ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ”లూజర్ 2′ ను తీసుకువస్తోంది.తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కింది. ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం…

వినూత్నమైన వినోదంతో ఉర్రూతలూగించడానికి వచ్చిన మరో ఓటిటి “సన్ షైన్ ఓటిటి”

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన “సన్ షైన్ ఓటిటి యాప్”.ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు.ఈ ఓటిటి యాప్  లాంచ్ వేడుక హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో ఘనంగా జరిగింది.ఈ ఓటిటి లాంచ్ వేడుకకు ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తిక్ ల ముఖ్య అతిధులుగా వచ్చి సన్ షైన్ ఓటిటి ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంల ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..మా సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్,…

రామ్ చిత్రానికి ‘ది వారియర్’ టైటిల్ ఖరారు

‘The Warriorr’ is the title of Lingusamy-Ram Pothineni's Tamil-Telugu bilingual

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ టైటిల్ ఖరారు చేశారు. రామ్ 19వ చిత్రమిది. సోమవారం టైటిల్ రివీల్ చేయడంతో పాటు రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామ్ – లింగుస్వామి కాంబినేషన్… తొలిసారి రామ్ స్ట్రయిట్ తమిళ సినిమా… దర్శకుడు లింగుస్వామి తెలుగు సినిమా చేస్తుండటం… సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. అప్పటి నుంచి సినిమా కథ ఏమై ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అనే ఆసక్తి పెరిగింది. రామ్ క్యారెక్టర్, కథ గురించి ఈరోజు దర్శకుడు లింగుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్…

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 1న విడుదల

Megastar

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగాది సంద‌ర్భంగా.. ఏప్రిల్ 1 విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా … చిత్ర నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది. అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్…

‘బంగార్రాజు’ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన‌ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు : నాగార్జున

Bangarraju success celebrations

‘బంగార్రాజు’ ​మొద‌టిరోజు వ‌సూళ్ళు 17.5 కోట్లు గ్రాస్ : నాగార్జున అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుద‌లైన మొద‌టిరోజునే సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా న‌మోదు చేసుకుంది. ఈ సంద‌ర్భంగాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్ర‌క‌మంలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, క‌ళ్యాణ్ కృష్ణ‌, మ‌ల‌యాళ న‌టుడు సూర్య‌, టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ జునైద్‌, అనూప్ రూబెన్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు పాదాబివంద‌నం తెలియ‌జేస్తూ ఆరంభించారు. జ‌న‌వ‌రి 14న…

‘వర్మ’ వీడు తేడా.. చిత్రంలోని పాట విడుదల

VARMA (VEEDU THEDA) Hero: Natti Kranthi Heroine: Muskan

“గుండెలోన నువ్వే….” అంటూ హృదయాలను కదిలించే “వర్మ” వీడు తేడా చిత్రంలోని పాట సంక్రాంతి సందర్భంగా శనివారం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చిత్రం ట్రైలర్…

దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు : మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjivi News

”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు : చిరంజీవి ”భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని కోరుకుంటూ అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు” అంటూ తన…

‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణ

Janatha TV calender-2022

హైదరాబాద్: ‘జనత’ తెలుగు టీవి ప్రచురించిన ప్రత్యేక న్యూ ఇయర్-2022 క్యాలెండర్ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఆవిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్, టీజేయూ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్, జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా, జనత టీవి…