దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు : మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjivi News
Megastar Chiranjivi News
Spread the love

”తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు : చిరంజీవి

”భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని కోరుకుంటూ అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు” అంటూ తన ట్విట్టర్ ద్వారా మరో సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.