‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణ
Janatha TV calender-2022
హైదరాబాద్: ‘జనత’ తెలుగు టీవి ప్రచురించిన ప్రత్యేక న్యూ ఇయర్-2022 క్యాలెండర్ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘జనత’ తెలుగు టీవి న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఆవిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్, టీజేయూ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్, జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా, జనత టీవి స్టేట్ బ్యూరో షేక్ రషీద్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మేనేజర్ కానుకటి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు మాట్లాడుతూ గత రెండేళ్లుగా ‘జనత’ తెలుగు టీవి ఉన్నతమైన ఆశయాల సాధనకోసం, ప్రజాసమస్యలపై నిరంతరం పాటుపడుతుందని అన్నారు. జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా కు జర్నలిస్టుగా మంచి అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే టీవీని నడుపుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్రమం తప్పకుండా పత్రికను ప్రజల ముంగిళ్లలోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా గత రెండేళ్లుగా న్యూ ఇయర్ క్యాలెండర్ ను ప్రజలకు కానుకగా అందిస్తున్నారని చెప్పారు.
