మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కొందరు కాలంతోపాటు పరిగెడుతుంటారు, కానీ ఈయన మాత్రం కాలానికి ఒక రెండు అడుగులు ముందే ఉంటారు. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతం, అవి మొదటి ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని రోజులు తరువాత అర్ధమవుతాయి, ఇంకొన్ని రోజులు తరువాత అద్భుతం అనిపిస్తాయి. “ఆహా” లో అన్ స్టాపబుల్ లాగా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30…
Category: FILM NEWS
Yasodha Telugu Movie Review : ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’!
చిత్రం : యశోద విడుదల : 11, నవంబర్ 2022 రేటింగ్ : 3.75/5 నిర్మాణం : శ్రీదేవి మూవీస్ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం : హరి -హరీష్ నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు. *** సంగీతం: మణిశర్మ మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి పాటలు: రామజోగయ్య శాస్త్రి కెమెరా: ఎం. సుకుమార్ ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్ క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. సమంత…
బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బి.నర్సింగ్ రావు!
తరచుగా అతడిని వరిస్తుంటాయి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు! అతడు బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బొంగు నరసింగరావు! బి. నరసింగరావుగా విఖ్యాతుడైన అతని నిరుపమాన జీవనయాత్ర తెలిసిన వారికి ఈ పురస్కారాల వెల్లువలు ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించవు. థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెలకొల్పిన సాధికారతకు నిదర్శనం; తనకు లభించిన పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు, అసంఖ్యాక అంతర్జాతీయ అవార్డులు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, తెలంగాణ ప్రజలు, సమ్మోహన పరిచే జానపదుల కళలు, తన మదిలో, ఎదలో, రక్తనాళాల స్పందనలలో నవనవోన్మితంగా చివురులు…
నవంబర్ 18న దిల్ రాజు విడుదల చేస్తున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మసూద’
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని.…
సమంత ‘వన్ మోర్ కావాలా?’ అని అడిగేవారు… ఆవిడ హెల్త్ కండిషన్ షూటింగ్ చేసేటప్పుడు మాకు తెలియదు : ‘యశోద’ దర్శకులు హరి, హరీష్ ఇంటర్వ్యూ..
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ… మీరు తమిళంలో ‘ఒరు ఇరవు’, ‘అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు తీశారు. ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా ఉంటాయి. ఎక్స్‌పరిమెంట్స్ కూడా! స్కేల్ పరంగా చూస్తే ‘యశోద’ పెద్ద సినిమా. దీని గురించి చెప్పండి! -స్కేల్ పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఛాలెంజ్ పరంగా అయితే సేమ్. మా తొలి సినిమా ‘ఒరు ఇరవు’లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం.…
ఆసక్తిని రేకెత్తించిన ‘బుట్ట బొమ్మ’ టీజర్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘బుట్ట బొమ్మ’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న చిత్రమిది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయమవుతున్నారు. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే….ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం ఆకట్టుకుంటుంది. “మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్… ఇంకోసారి చెయ్యాలంటే … ఇప్పుడు…
Rajesh Touchriver’s social thriller ‘Dahini: The Witch’ makes it to the Swedish International Film Festival
Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled ‘Dahini’, which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it. The social thriller, which is about the scourge of witch-hunting, has got a new feather in its cap. It…
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో రాజేష్ టచ్‌రివర్ ‘దహిణి’
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా ‘దహిణి’. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘దహిణి’ ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు లభించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా…
కట్టిపడేసే విజువల్స్ తో ఆకట్టుకున్న ‘ఏది నిజం నా ప్రేయసి’ ఆల్బమ్ సాంగ్
వెండితెరపై కోట్లు ఖర్చుపెట్టి సెట్లు వేసి, హంగులు ఆర్భాటలతో డైరెక్టర్లు ఒక పాటను చిత్రీకరిస్తారు. దానికి ఏ మాత్రం తీసిపోకుండా… ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన విజువల్స్ తో ఒక ఆల్బమ్ సాంగ్ ని మన తెలుగు యువదర్శకుడు తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆల్బమ్ సాంగ్స్ హాలీవుడ్ లో తీస్తుంటారు. మనదగ్గర చాలా అరుదు. యువదర్శకుడు వివేక్ కైపా పట్టాబిరామ్ దర్శకత్వం వహించిన ‘ఏదీ నిజమ్ నా ప్రేయసి’ అనే ద్విభాషా (తమిళం-తెలుగు) ప్రయోగాత్మక కాన్సెప్ట్ ఆల్బమ్ పాట ఇప్పుడు విశేషప్రజాదరణ పొందుతుంది. అంతే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ దిగ్గజాలలో ఈ పాట చర్చినీయాంశం అవుతుంది అంటే ఈ ఆల్బమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. యువ ప్రతిభను ప్రోత్సహించే వసంత్ రామసామి ఈ పాటను నిర్మించగా, మ్యూజిక్…
జెన్నిఫర్ కు నచ్చిన హీరో ఎవరో తెలుసా?
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… – నేను ముంబై నుంచి వచ్చాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేశాను..తర్వాత జర్నలిజం లో డిప్లొమా పూర్తయ్యాక యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో పాటు భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి. నేను టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రం బాయ్స్ విల్ బీ బాయ్స్.…
