వైభ‌వంగా ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ వివాహం

వైభ‌వంగా ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ వివాహం

క‌ళ్యాణం క‌మ‌నీయం.. హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్య‌తే వేరు. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు సిద్ధం చేసి దానిపై వ‌ధువ‌రుల‌ను కూర్చుండ‌బెట్టి ఒక్క‌టి చేసి మంగ‌ళ వాయిద్యాల‌తో వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఆశీర్వ‌దించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్‌. ఆయ‌న ప్ర‌థ‌మ కుమార్తె, శాకుంత‌లం మూవీ ప్రొడ్యూస‌ర్ అయిన‌ చి.సౌ.నీలిమ గుణ వివాహం డిసెంబ‌ర్‌ 2 రాత్రి 12 గంట‌ల 31 నిమిషాల‌కు (తెల్ల‌వారితే శ‌నివారం) .. ప్ర‌ముఖ విద్యావేత్త‌, వ్యాపార‌వేత్త‌, ఎంట‌ర్ ప్రెన్యూర‌ర్, శ్రీ శ‌క్తి గ్రూప్ అధినేత‌లు, హైద‌రాబాద్ వాస్త‌వ్యులు అయిన డా.రామ‌కృష్ణ పింజ‌ల‌, శ్రీమ‌తి స‌త్య పింజ‌ల గారి కుమారుడు ర‌వి ప్ర‌ఖ్యాతో జ‌రగనుంది. అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గుతున్న వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్ నామా ప్యాలెస్ వేదిక అయ్యింది. ప‌లువురు…

బాలయ్య ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదల

nandamuri balakrishna Veerasimhareddy movie jan 12th Relese

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్‌ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో బాలకృష్ణ సీరియస్ లుక్‌ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది. సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు…

టెలివిజన్ ప్రీమియర్‌ లోనూ ‘కార్తికేయ – 2’ ప్రభంజనం

Kaarthikeya2 Movie Prabanjanam

నిఖిల్ సిద్ధార్థ నటించిన ఎపిక్ అడ్వెంచర్ ‘కార్తికేయ 2’ ప్రతిచోటా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంతో పాటు అగ్ర దర్శకులు, హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. థియేటర్లు, OTTలో మంచి రికార్డ్స్ సృష్టించిన తర్వాత, ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌లో చాలా మంచి టిఆర్‌పి రేటింగ్‌లను పొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగులో ప్రసారం కావడం ద్వారా 7.88 రేటింగ్‌ను అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ‘కార్తికేయ 2’కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. థియేటర్లలో, ఓటీటీలో, ఇప్పుడు ఇంట్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మకంగా…

రాజమౌళికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ అవార్డు

director S S Rajamouli news

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా.. ఎక్కడవిన్నా దర్శకధీరుడి గురించే. ఆయనకు ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. కారణం లేకపోలేదు.. దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతటి గొప్ప వ్యక్తిని మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అందుకే ఈ ప్రశంసలు. టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటినుంచి దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకుంటూ వస్తున్న రాజమౌళికి అవార్డులు అనేవి కొత్తవికాకపోయినా.. ఈ అవార్డు మాత్రం ఖచ్చితంగా గొప్పదే అనొచ్చు. విషయాల్లోకి వెళితే..న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) ‘త్రిబుల్ ఆర్’ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా కూడా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ…

సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

SaiTej New Movie Opening

సుప్రీమ్ హీరో సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త చిత్రం ప్రారంభమైంది. జ‌యంత్ పానుగంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్నారు. ఈ సందర్బంగా జరిగిన ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత బాపినీడు భోగ‌వ‌ల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ అమ్మ‌గారు విజ‌య దుర్గ‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌తీమ‌ణి విజ‌య ల‌క్ష్మి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బుచ్చి బాబు సానా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ ‘‘సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థ‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయ‌న మా…

‘కథ వెనుక కథ’ టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల

kathavenukakatha tittle first look launch

విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్స్‌ ప్రొడక్ష‌న్ నెం.1గా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’.కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ని గురువారం ప్రసాద్ ల్యాబ్య్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా… నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. మీడియా ఈ చిత్రాన్ని చూసి సహకరించాలి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు. చిత్రానికి పని చేసిన అందరికీ థాంక్స్. అలీ, సుమన్ ఇలా అందరూ చక్కగా నటించారు.…

పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ నెం-1 షూటింగ్ ప్రారంభం!

VVR Production movie shooting opening

పీవీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా రామ్ తేజ్‌, గ‌రిమ జంట‌గా రూపొందుతోన్న నూత‌న చిత్రం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభ‌మైంది. అక్ష‌య్ కృష్ణ న‌ల్ల ద‌ర్శ‌క‌త్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఆనంద్ రాజ్ ఓంకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. స‌మాజంలో జ‌రుగుతోన్న అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను ఓ సామాన్య యువ‌కుడు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర క‌థాంశం. ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ముహ‌ర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత రామ‌స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ..“పీవీఆర్ ప్యాష‌న్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ద‌ర్శ‌కుడు అక్ష‌య్ కృష్ణ‌కు ఫిలిం ఇండ‌స్ట్రీలో ఎంతో…

శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్-2 జనవరిలో ప్రారంభం !!

manjunath sweeya darshakathwamlo maro chithram

“మా ఊరి ప్రేమకథ” చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజునాథ్.. అదే ఉత్సాహం, ఎనర్జీతో మరో డిఫరెంట్ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నయామి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై వర్ష-వర్షిణి సమర్పణలో మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీదేవి-యస్వీ మహేంద్ర నాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు. హీరో, దర్శకుడు- మంజునాథ్ మాట్లాడుతూ-” ఒక లేబర్ కుర్రాడు జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక లేబర్ యువకుడు అనుకోని పరిణామాల వల్ల అతని జీవితం…

aha to stream world digital premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December

aha to stream world digital premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December

The film features Allu Sirish, Anu Emmanuel in the lead roles – Hyderabad, 2nd December: Emotions strengthen at the moment and can change at any time. While we live in the era of ease of access and convenience, relationships today are more complicated than ever. Highlight such complexities of modern-day relationships in rom-com format; aha, the 100% local OTT platform is all set to strengthen its robust catalogue of films with the World Digital Premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December 2022. The movie produced by GA2 Pictures and Shri…

‘ఆహా’లో డిసెంబర్ 9న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’

aha to stream world digital premiere of ‘Urvasivo Rakshasivo’ on 9th December

‘ఆహా’ 100% తెలుగు లోక‌ల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ చిత్రాల‌ను, ఒరిజిన‌ల్స్‌ను, టాక్ షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మ‌రో సూప‌ర్ హిట్ మూవీ చేసింది. అదే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా. ఈ చిత్రం డిసెంబ‌ర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. జీఏ 2 పిక్చర్స్‌, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్ రూపొందించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భావోద్వేగాల‌నేవి ప్ర‌స్తుతానికి బ‌లంగానే ఉన్న‌ట్లు అనిపిస్తాయి. కానీ ఏ స‌మ‌యంలోనైనా అవి మారే అవ‌కాశాలున్నాయి. మ‌నం మ‌న‌కు అన్ని అదుబాటులో ఉంటున్నాయి. అయితే మ‌నుషుల మ‌ధ్య ఉండే బంధాల‌నేవి చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్ర‌స్తుత కాలంలోని అలాంటి…