టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది త్రిష. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు. సోషల్ మీడియా హడావిడి అంతా ఇంతా లేదు. విషయం ఏదైనా రచ్చ చేయడం మాత్రం పచ్చినిజం! ఇక వినోదరంగం పై ఈ హడావిడి మామూలుగా ఉండదు. స్టార్ హీరోయిన్ల విషయంలో అయితే.. మరీ శృతిమించిపోతోంది! సరిగ్గా అందాలతార త్రిష విషయంలో ఇదే జరిగింది. గత కొన్నిరోజులుగా త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం సోషల్ మీడియా పుణ్యమాని మరింత ఊపందుకుంది. తొలుత ఈ విషయాలను త్రిష కొట్టిపారేసింది.. నెటిజనుల పోస్టులకు ముసిముసిగా నవ్వుకుంది. అయితే.. నెటిజనులు మాత్రం పోస్టింగులు ఆపలేదు సరికదా.. మరింత రెచ్చిపోయారు. ఇక లాభం లేదనుకున్న ఈ బ్యూటీ తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించి…
Category: FILM NEWS
‘ఖుషి’ రి-రిలీజ్ అభిమానులకు ఐకాన్ చిత్రాన్ని మళ్లీ సెలెబ్రేట్ చేసుకునే అవకాశం: నిర్మాత ఎ.ఎం. రత్నం
*లైలా-మజ్ను, రోమియో-జూలియట్ తరహాలో గుర్తుండిపోయే ప్రేమకథ ‘ఖుషి’ అని నిర్మాత తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘ఖుషి’. పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి.. మణిశర్మ సంగీతం అందించగా, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. విడుదల సమయంలో ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఒకటైన ఖుషి.. రెండు దశాబ్దాల తర్వాత కూడా అదే కొత్త అనుభూతినిస్తోంది. రీ-రిలీజ్ కోసం విడుదల చేసిన ఖుషి ప్రత్యేక ట్రైలర్ అభిమానులను…
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికి రావడం ఇంకా పెద్ద పండగ: కొరియోగ్రాఫర్ విజే శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్యలోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు విజే శేఖర్ మాస్టర్.…
‘వీరసింహారెడ్డి’తో నా కల నెరవేరింది: చంద్రిక రవి ఇంటర్వ్యూ…
బాలకృష్ణ గారితో కలసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. థర్డ్ సింగిల్ గా విడుదలైన ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి’ పాట అయితే సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్…
ఐజేయూ నేతతో ఛత్తీస్ గఢ్ జర్నలిస్ట్స్ ప్రతినిధి బృందం భేటి : రాష్ట్రం పర్యటించాలని విన్నపం
తమ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చేయూత నివ్వాలని స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ ప్రతినిధి బృందం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)ను విజ్ఞప్తి చేసింది. ఐదుగురితో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం నాడు హైదరాబాద్ పర్యటించి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డిని కలుసుకుంది. ఈ సందర్భంగా లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మీడియా స్థితిగతులు, మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులు తదితర అంశాలను ప్రతినిధి బృందం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దేశంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐజేయూ కొనసాగిస్తున్న రాజీలేని పోరాటాలకు తాము ఆకర్షితులైనట్లు వారు స్పష్టం చేశారు. ఐజేయూ ప్రతినిధి బృందం తమ…
‘ఎస్ 5 నో ఎగ్జిట్’ కు విడుదలకు మందే భారీ అమౌంట్ కు థియేట్రికల్ హక్కులు : దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, నిర్మాత గౌతమ్ కొండెపూడి దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ….నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో హీరో కావాలనే ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నేను చేసిన డాన్సులు చూసి బాగా డాన్సులు చేస్తున్నావు అని…
హీరో క్యారెక్టర్ ‘టాప్ గేర్’లోనే ఉంటుంది : హీరో ఆది సాయికుమార్
యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ ‘టాప్ గేర్’ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి? -కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్…
నిరాహారదీక్షలు చేస్తున్ననిర్మాతలను పట్టించుకోకపోవడం దారుణం : సీనియర్ నిర్మాత నట్టికుమార్
ఎన్నికలు జరపకపోవడం అప్రజాస్వామికం రెండేళ్ల కాలపరిమితి పూర్తయి, మూడవ ఏడాది గడుస్తున్నప్పటికీ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు జరపకపోవడం అప్రజాస్వామికమని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిర్మాత జె.వి. మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నట్టి కుమార్ స్పందిస్తూ…రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్మాతలందరికీ తన మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్ష,కార్యదర్శులుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల గడువు ఎప్పుడో పూర్తయినా, వారు ఆ పదవులనే పట్టుకుని ఊరేగడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. లేక 99 ఏళ్ల వరకు ఎలాంటి ఎలక్షన్స్ జరపకుండా తామే ఆ పదవులలో కొనసాగాలని…
Samantha : పోరాటమే ఆమె బలం!
సమంత తాజాగా తన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఒక్క రిమార్కు లేకుండా ఎంతో హుందాగా వ్యవరిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సృష్టించుకుంది. తన నిజ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ధైర్యంగా నిలబడింది. ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి ఒంటరి పోరునే సాగిస్తోంది! పోరాటమే ఆయుధంగా మలచుకుంటోంది! ఇలాంటి కష్టాల్లో కూడా ఎక్కడా తగ్గకుండా తన పాత్రని సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అందరి చేత మరింత అభిమానాన్ని పొందుతోంది! మోడలింగ్ లో పేరుతెచ్చుకున్నాక వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ ‘ఏ మాయ చేశావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదే సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్యను…
ఇలాంటి పాత్రలు చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి : ‘జయహో రామానుజ’ ఈవెంట్‌లో హీరో సుమన్
సుదర్శనం ప్రొడక్షన్స్ లో జయహో రామానుజ చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారు, f.d.c చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి మాట్లాడుతూ.. ‘నాలానే సాయి వెంకట్ కూడా ఎన్నారై. జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈవెంట్‌కు చిన్నజీయర్ స్వామిని తీసుకురండి. ఆయన…
