పాకిస్తాన్ లో అల్లు అర్జున్ అభిమాని కోరికే తండేల్ కి పునాది!

Allu Arjun fan's desire in Pakistan is the foundation of Tandel!
Spread the love

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తూ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తండేల్. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి గల మూల కారణం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్. నిజానికి పాకిస్తాన్ లో చిక్కుకుని కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేయడం జరిగింది. అతడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ జాలరులు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సాయపడుతూ వచ్చాడు ఆ కానిస్టేబుల్. అయితే ఆ జాలరులు విడుదలవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్ అడిగారు. అదేంటంటే మీ దేశంలోని ఐకాన్ సార్ అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఆయన అభిమానిని. నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని నాకు పంపించండి అని కోరడం జరిగింది. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ జాలరులు కార్తీక్ అనే వ్యక్తికి జరిగిన విషయం అంతా చెప్పడంతో అతడు ఎట్టకేలకు ఈ జరిగిన కథ అంతటిని గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలోని బన్నీ వాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం చెప్పడం జరిగింది. తద్వారా జరిగిన కథను తెలుసుకున్న బన్నీ వాసు ఈ కథపై ఆసక్తి కలిగి జరిగిన పూర్తి కథను తెలుసుకొని, దీనిని అందరూ తెలుసుకునే విధంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అలా బన్నీ ఫ్యాన్ అయిన కరాచీ జైలులోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఇప్పుడు జరిగిన ఆ కథ అంతా తండేల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

Related posts

Leave a Comment