గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్‌కు రావడం జరిగింది. అసిస్టెంట్ పెళ్లికి హజరైన తర్వాత రష్మిక,విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో రష్మిక తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరు ఒక్కసారి షాక్‌కు గురైయ్యారు. విజయ్ ఇంట్లోనే రష్మిక ఉందని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేశారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రష్మిక ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో నేను దయను దానితో వచ్చే ప్రతిదాన్ని ఎంచుకుంటాను. మనమందరం ఒకరికొకరు తోడుగా ఉందాం అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక కాలుకు ఇటీవల గాయం అయింది. ఇటువంటి సమయంలో విజయ్ దేవరకొండ ఆమె పక్కన లేకపోవడంతోనే రష్మిక ఇలాంటి పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విజయ్‌దేవరకొండ-రష్మికల బ్రేకప్!?
