ఆలేరు: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ కీర్తించారు. ఆలేరు పోచమ్మ గుడి ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ దంపతులు స్వామివారి కల్యాణం ఘనంగా జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు బొట్ల పరమేశ్వర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన, లోక కల్యాణం కోసం ఎన్నో కష్టాలకోర్చిన శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం. ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని బొట్ల పరమేశ్వర్ దంపతులు అభిలషించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో బొట్ల విశ్వేశ్వర్ . బొట్ల రోహిత్ భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు సబ్బని సుభాష్, పాసి కంటి శ్రీనివాస్, మల్ రెడ్డి నరసింహారెడ్డి, దయ్యాల సిద్ధులు , నరసింహులు, బండా శ్రీనివాస్, జిల్ గారి వెంకటేష్, జి కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
శ్రీ సీతారాములు మనందరికీ ఆదర్శం : ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్
