ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుల వల్లే బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి : ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు

Great films have been made possible by great directors like SV Krishna Reddy: Renowned producer Chadalavada Srinivasa Rao
Spread the love

లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – బయట భరించరానంత ఎండలు ఉన్నాయి కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ లో మాత్రం కాశ్మీర్ మంచు కొండల్లో కూర్చున్నట్లు ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు గారు, ఎండీ రామ్మోహన్ రావు గారు, నా స్నేహితులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి..ఇలాంటి మంచి వాళ్ల వల్ల ఇండస్ట్రీ ఎంత బాగుంది. ఇండస్ట్రీలోని వాళ్లంతా వచ్చి ఇలా హోమ్లీగా ఒక కార్యక్రమం చేసుకుని ఎంతో కాలమైంది. దాదాపు 40 ఏళ్లుగా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే బ్రహ్మాండమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ఉండేది. ఎస్వీ కృష్ణారెడ్డి గారు తీసిన యమలీల, ఘటోత్కచుడు, ఎగిరే పావురమా..ఇలా ఒక సినిమాను మించి మరో సినిమా విజయం సాధిస్తూ వెళ్లాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా ఎస్వీకే గారు తమ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన సినిమాలు ఒక్కోటి ఏడాది పాటు థియేటర్స్ ను ఫీడ్ చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి మంచి దర్శకులు వందేళ్లు ఆరోగ్యంగా జీవించి వంద చిత్రాలు పూర్తి చేయాలని, ఆయన ద్వారా మన సినిమా ఇండస్ట్రీకి మళ్లీ పాత రోజులు రావాలని కోరుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కృష్ణారెడ్డి గారు ఇలాగే ఉన్నారు. ఆయన రహస్యం ఏంటో మా అందరికీ చెప్పాలి (నవ్వుతూ). మీ ఆరోగ్యం లాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఎస్వీ గారి జన్మదినం కాదు మా ఇంట్లో మా సోదరులది అన్నట్లు భావిస్తున్నాం. అన్నారు.

Related posts