మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

Prominent Producer Allu Aravind Shows His Generosity
Spread the love

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులైన ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చల్వాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీకి అల్లు అరవింద్ 30 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులంతా అల్లు అరవింద్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Related posts