ఏప్రిల్ 14న వస్తున్న రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu Releasing Worldwide Grandly On April 14, Tagore Madhu’s Pixel Studios Acquire AP, TS Theatrical Rights
Spread the love

ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్

యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా విడుదల కోసం మేకర్స్ బెస్ట్ స్లాట్‌ని ఎంచుకున్నారు.
ఏప్రిల్ 14, 2023న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో లారెన్స్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.
లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ.
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం – కతిరేశన్, నిర్మాత- కతిరేశన్, బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ డి రాజశేఖర్ ISC, ఎడిటర్: ఆంథోనీ, స్టంట్స్: శివ – విక్కీ

Related posts

Leave a Comment