మేమూ నష్టపోయాం..ఆదుకోండి!

We are also lost..help!

విజయ్‌ దేవరకొండ సమాజ సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ముఖ్యంగా ప్రతీ ఏటా తన పుట్టిన రోజున జనాలకు ఏదో విధంగా హెల్ప్‌ చేస్తుంటాడు. అదే విధంగా ఖుషీ సినిమా సక్సెస్‌ కావడంతో తన వంతుగా వంద కుటుంబాలకు లక్ష చోప్పున కోటి రూపాయలు పంచుతానని సక్సెస్‌ మీట్‌లో ప్రకటించాడు. దీనిపై చాలా మంది విజయ్‌ దేవరకొండను ప్రశంసించగా.. టాలీవుడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలలో ఒకటైన అభిషేక్‌ పిక్చర్స్‌ విజయ్‌ చేసిన ప్రకటనపై వింతగా స్పందించింది. ఈ సంస్థ సినిమాలను డిస్టిబ్యూట్ర్‌ కూడా చేస్తుంది. కాగా విజయ్‌ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాను ఈ సంస్థే రిలీజ్‌ చేసింది. అయితే ఈ సినిమా వల్ల అభిషేక్‌ పిక్చర్స్‌ రూ. 8 కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు అదే విషయంపై ట్వీట్‌ వేస్తూ విజయ్‌ను ట్యాగ్‌ చేసింది. ఇప్పుడు…