కత్రీనాతో కలిసి డ్యాన్స్‌ చేసిన సల్మాన్‌!

Salman danced with Katrina!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్‌ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇదే జోనర్‌లో వచ్చిన టైగర్‌ 3 మరోసారి ఈ క్రేజ్‌ను బాక్సాఫీస్‌ను రుచి చూపించింది. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం టైగర్‌ 3 . కత్రినాకైఫ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన టైగర్‌ 3 దీపావళి కానుకగా నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్‌ అవుతూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది. ఇక సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమాన లోకానికి ధన్యవాదాలు తెలియజేశాడు సల్మాన్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలోనే టైగర్‌ టీమ్‌ అంతా ముంబయిలోని ఓ…