నటిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ… విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్బంగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ”మా ‘శబరి’ చిత్రీకరణ పూర్తయింది. మహేంద్ర గారి లాంటి నిర్మాత లభించడం మా అదృష్టం. సినిమా కోసం ఆయన చాలా ఖర్చు చేశారు. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయిని దర్శకుడు అనిల్ తెరపైకి తీసుకొచ్చారు. మేము చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది. ‘శబరి’లో ప్రధాన పాత్ర పోషించినందుకు సంతోషంగా…