టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సెట్ లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజ మహదాస్య హీరోగా, బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా, ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధానపాత్రలో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తన నటనా ప్రతిభతో…