ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పలువురు వక్తలు అన్నారు. ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల ప్రొడ్యూసర్‌గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా… సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందని అన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందని ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని,…