– సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు – ఘనంగా నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు పేరిణి నృత్య వికాసం కోసం జీవితం అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. తారామతి బారాదరిని నటరాజ రామకృష్ణ ఆలోచనలతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన గుర్తు చేశారు. పేరిణి, ఆంధ్ర లాస్య నృత్యాలను పునః సృష్టించి జాతికి అంకితం చేశారని, వారి సేవలు అజరామరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్య గురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల కళాకారులను, పత్ర సమర్పకులను,…