మ‌న పండ‌గ‌, మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మ‌న తెలుగు జీ5.. సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ను ప్రారంభించిన రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్‌

Mana Pandaga, Mana Entertainment, Mana Telugu Zee5.. Rocking Star Manchu Manoj launches Sankranti festival celebration campaign

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ న‌టించిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ఆవిష్క‌రించింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే జీ5 హామీ మ‌రింత ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది.సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. సంక్రాంతి సంద‌ర్భంగా రూపొందించిన సంప్ర‌దాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్.. పండుగ సంద‌ర్భంలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య…